![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -292 లో... అప్పు, కళ్యాణ్ తో డాన్స్ చేసి కళ్యాణ్ ని హగ్ చేసుకొని ఐ లవ్ యు అని చెప్తుంది. దాంతో కళ్యాణ్ తో పాటు అందరు షాక్ అవుతారు. అది విని అనామిక వాళ్ళ అమ్మ వచ్చి కళ్యాణ్ దగ్గర నుండి అప్పుని లాగుతుంది. ఫ్రెండ్ అని చెప్తూ నాకు కాబోయే అల్లుడిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నావని అంటుంది.
అ తర్వాత అ విషయంలో రుద్రాణి కలుగుజేసుకొని.. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ దొరికింది ఛాన్స్ అని కనకాన్ని తిడుతుంది. అలా తన తల్లిని తిడుతుందని స్వప్న, కావ్య ఇద్దరు కలిసి రుద్రాణిని కోప్పడతారు. ఆ తర్వాత కళ్యాణ్ మధ్యలో కలుగుజేసుకొని మీరు అందరు ఏ కాలంలో ఉన్నారు. ఇప్పుడు ఐ లవ్ యు అనే పదం అందరు చెప్పుకుంటున్నారు. మేమ్ మంచి ఫ్రెండ్స్ అంతే అని కళ్యాణ్ అందరికి క్లారిటీగా చెప్తాడు. కాసేపటికి మళ్ళీ సంగీత్ మొదలు పెడతారు. రాజ్ , కావ్య ఇద్దరు డాన్స్ చేస్తి అందరిని అలరిస్తారు. మరొకవైపు స్వప్న, కనకం ఇద్దరు అరుణ్ దగ్గరకీ వెళ్తుంటే అప్పుడే మురళి చూసి వాళ్ళని ఫాలో అవుతాడు. వాళ్లే అరుణ్ ని కిడ్నాప్ చేసాడని రాహుల్, రుద్రాణీలకి దగ్గరికి చెప్పి అరుణ్ దగ్గరకి తీసుకొని వస్తాడు. వీళ్లే అరుణ్ ని కిడ్నాప్ చేశారని అందరు ఎలా నమ్ముతారని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న తాగుబోతు స్వప్న, కనకం ఇద్దరు అరుణ్ ని కిడ్నాప్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తాడు. ఆ వీడియోని రుద్రాణి చూస్తుంది.
ఆ తర్వాత రుద్రాణి వెళ్లి అందరికి ఆ వీడియో చూపిస్తోంది. అందరు కనకాన్ని తప్పు పడతారు. కానీ అరుణ్ ని బెదిరించి అందరి ముందుకి పద్మావతి తీసుకొని వస్తుంది. నిజం చెప్పు అని పద్మావతి బెదిరిస్తుంది అంతే కాకుండా రాజ్ , విక్కీ లు సైతం అరుణ్ ని బెదిరించడంతో.. ఎక్కడ తన పేరు చెప్తాడో అని రాహుల్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత అరుణ్ తప్పుని ఒప్పుకుంటాడు. మా తర్వాత నేను హాస్పిటల్ పెడుదామని అనుకుంటున్నాను. ఆ డబ్బులు స్వప్నని బ్లాక్ మెయిల్ చేసి తీసుకోవాలని అనుకున్నాను అందుకే అలా చెప్పాను కానీ స్వప్న కడుపులో పెరుగుతున్న బిడ్డకి రాహులే తండ్రి అని అరుణ్ చెప్తాడు. అ తర్వాత రాహుల్ చెంప పగులగొడుతుంది స్వప్న. తప్పు మీరు చేసి నా గురించి తప్పుగా మాట్లాడావని రాహుల్, రుద్రాణికి స్వప్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. కాసేపటి తర్వాత రాహుల్ , రుద్రాణి, మురళి వాళ్ళు జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు. తరువాయి భాగంలో అప్పు ప్రేమిస్తున్న విషయం అందరికి తెలుస్తుంది. అప్పు కూడా నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నానని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |